TG: కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. దుండగులు 5 షాపుల తాళాలు పగలగొట్టి రూ.5 లక్షలు, 10 సెల్ఫోన్లు, ఇతర వస్తువులు చోరీ చేశారు. రామారెడ్డిలో వృద్ధురాలు గంగవ్వ ఇంట్లో చొరబడి 4 తులాల బంగారం, 45 తులాల వెండి అపహరించారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.