PDPL: రామగుండం నగరంలో ఈ నెల 11న ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం ఉంటుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ప్రారంభోత్సవంలో మంత్రులు పాల్గొంటారని, టూర్ షెడ్యూల్ త్వరలో ఖరారు అవుతుందన్నారు. 633 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు, 479 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 576 మంది నిరుపేదలకు ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేస్తారన్నారు.