ATP: గుంతకల్లు 29వ వార్డుకు చెందిన ఓసీ అనే మహిళ గత కొన్ని రోజులుగా నరాల వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దృష్టికి వార్డ్ ఇంఛార్జ్ అంజి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే బాధితురాలి చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ పథకం కింద రూ. 3,00,557 మంజూరు చేసి, బాధిత కుటుంబానికి అందజేశారు.