VSP: ప్రధాని మోదీ నేటి నుంచి 3 రోజులపాటు స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన సోమనాథ్ ఆలయానికి చేరుకుని రాత్రి 8 గంటలకు ఓంకార మంత్ర పఠనం చేస్తారు. రేపు ఆలయ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ శౌర్య యాత్ర, ఆపై బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన ట్రేడ్ షోను ప్రారంభిస్తారు.