GNTR: తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్(52) హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని దుండగులు ఫయాజ్ను కొట్టి చంపి పడవేశారు. స్థానికులు గుర్తించి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా.. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.