MDK: శివంపేట మండలం శభాష్‌పల్లి సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన యాదగిరి గ్రామ ప్రధాన సమస్య తాగునీటి కొరతపై దృష్టి సారించారు. ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కొత్త వాటర్ పైపులైన్ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సక్రమంగా తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.