MBNR: రాజాపూర్ మండలం ఖానాపూర్లోని శ్రీ హనుమాన్ ఆలయ ఆవరణలో ఏర్పడిన నీటి సమస్యను సర్పంచ్ పూజారి శేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ శనివారం బోరు క్లీన్ చేయించి నూతన మోటర్, పైప్ లైన్ ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కరించినందుకు భక్తులు, గ్రామస్తులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకర్, ముస్తఫా, ప్రసాదచారి, బిక్యనాయక్ పాల్గొన్నారు.