గుంటూరు కృష్ణ కెనాల్ రైల్వే స్టేషన్-కృష్ణానది వంతెన మధ్య శనివారం రైలు ప్రమాదంలో సుమారు 75 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. తెల్ల చొక్కా, తెల్ల లుంగీ ధరించిన మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే జీ.ఆర్.పీ (GRP) ఎస్సైని సంప్రదించాలని పోలీసులు కోరారు.