ADB: ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.