NLG: కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతి సెలవులు రావడంతో పట్టణవాసులు పల్లె బాట పట్టారు. దీనితో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు భారీ స్థాయిలో వాహనాలు వెళ్తున్నాయి. విజయవాడ వైపుకు ఆరు గేట్లను ఎత్తి టోల్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.