ELR: జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని ఇంఛార్జ్ జిల్లా ఉపరవణ కమిషనర్ కృష్ణారావు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తనిఖీలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం వంటి అంశాలపై ఈ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.