W.G: నరసాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విస్తృతంగా పర్యటించారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పొత్తూరి రామరాజుతో కలిసి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, మంచినీటి సరఫరాపై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై స్పందించిన ఆయన, వెంటనే పనులు చేపట్టాలన్నారు.