ASF: రెబ్బెన మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను DAO వెంకట్ సోమవారం తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఎరువులు, పురుగు మందుల నిల్వలను రికార్డులతో సరిపోల్చారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని DAO హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.