సత్యసాయి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జపనీస్ మార్షల్ ఆర్ట్ కెంజుట్సులో అరుదైన గౌరవం సాధించడంపై పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వ్యక్తిగా పవన్ నిలవడం గర్వకారణమని కొనియాడారు. ఆయన క్రమశిక్షణ, సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ గొప్ప విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు శ్రీరామ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.