ADB: ప్రతి మహిళకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడమే పోష్ చట్టం ఉద్దేశమని, ఈ చట్టంపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధం, పరిష్కారం, POSH Act అమలుపై అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి 181 ఉమెన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు.