BHPL: ఈ నెల చివరిలోగా కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కలిసి రెవెన్యూ, దేవాదాయ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్తు శాఖల అధికారులతో దేవాలయ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.