SS: పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి సవిత శుక్రవారం ప్రత్యేక కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం కేవలం ఉద్యోగం కాదు, అది ఒక పవిత్ర సేవ అని కొనియాడారు.