హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. చైన్నై నుంచి రాంచీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఈ విమానంలో 134 మంది ప్రయాణికులు ఉండగా.. అంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.