మద్యం సేవిస్తే చలి తగ్గుతుందని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లగానే రక్తనాళాలు వ్యాకోచించి, రక్తం.. చర్మం ఉపరితలానికి చేరుతుంది. దాంతో మనకు పైకి వేడిగా అనిపించినప్పటికీ.. శరీరంలోని అంతర్గత వేడి బయటకు వెళ్ళిపోతుంది. దాని వల్ల చలిని తట్టుకునే శక్తి తగ్గి ‘హైపోథెర్మియా’ వంటి ప్రమాదాలు వస్తాయి. కాబట్టి చలి తగ్గాలంటే వేడి పానీయాలు తీసుకోవడం మంచిది.