KMM: సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో డిసెంబర్ 31న రాత్రి జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో భాగంగా శుక్రవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై బైరు గోపి తెలిపారు. నిందితుల నుంచి రూ.40,000 నగదు, సుమారు రూ.10,000 విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.