BPT: రాజముద్రతో ఉన్న రీ-సర్వే పట్టాదారు పాసుపుస్తకాలను ఈ నెల 12వ తేదీలోగా పంపిణీ చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. రీ-సర్వే పక్కాగా జరిగితేనే భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.