KRNL: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని జిల్లా నూతన అధ్యక్షుడు బి.క్రాంతి నాయుడు అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ అనుబంధ విభాగాలను శక్తివంతంగా తీర్చిదిద్దుతామన్నారు.