KDP: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని పోలీసులు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి లారీలు, బస్సులు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లకు ముఖం కడిగించి అలసట తొలగించి ప్రయాణం కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలు నివారించాలని పోలీసులు సూచించారు.