ATP: అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో డాగ్ స్క్వాడ్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పీ.జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు త్రీటౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి, మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలపై పరిశీలన చేశారు. పిక్‌పాకెటింగ్, చైన్ స్నాచింగ్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకున్నారు.