BPT: అద్దంకి పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో పట్టణంలోని 16 వార్డుల పరిధిలో మొత్తం 30 అభివృద్ధి పనులు (CC రోడ్లు, డ్రైనేజీలు) చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు.