కృష్ణా జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణపై కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2002 ఓటర్ల జాబితాలోని ఓటర్లను 2025 ఓటర్ల జాబితాలోని ఓటర్లతో మ్యాపింగ్ చేయాలన్నారు. 2025 ఓటర్ల లిస్టులోని ఓటర్లను 2002లో ఉన్న ఓటర్లతో వెరిఫై చేయాలని పేర్కొన్నారు.