అనంతపురం నగరంలోని పాతూరు శ్రీశృంగేరి శారదా పీఠం దత్తాత్రేయ స్వామి దేవస్థానంలో ఈనెల 10న శనివారం ఉదయం 9 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు గురుదత్త భక్త బృందం తెలిపింది. ధనుర్మాసం సందర్భంగా వైష్ణవ సంఘం సహకారంతో తిరుప్పావై పారాయణం కూడా జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.