GDWL: మనోపాడు మండలం జిల్లాపురం గ్రామానికి చెందిన జూనియర్ వైద్యురాలు లావణ్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు (శనివారం) జల్లాపురానికి రానున్నట్లు జిల్లా అధ్యక్షుడు పోగుల రాజేష్ ఓ ప్రకటనలో తెలిపారు.