అన్మమయ్య: నిమ్మనపల్లి మండలం పాత బస్టాండ్లో సోమవారం YCP విస్తృత సమావేశం నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, పార్లమెంట్ పరిశీలకురాలు అనీషా రెడ్డి, రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.