E.G: బిక్కవోలు మండలం మెళ్లూరు, ఆరికరేవుల, కొంకుదురు, పందలపాక గ్రామాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నటరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్షిక నిర్వహణ నిమిత్తం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.