AKP: పాయకరావుపేట పట్టణంలో ఉగాది తర్వాత మెయిన్ రోడ్ విస్తరణ పనులు ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్థానిక వై జంక్షన్ నుంచి తాండవ వంతెన వరకు రెండు కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు VMRDA రూ.5.25 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హోం మంత్రి అనిత జనవరి 30న ఈ పనులకు శంకుస్థాపన చేశారు.