AP: మంత్రి లోకేష్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించనున్న ‘వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ఇన్నోవేషన్ ఫోరం’ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రభుత్వ పాలనలో సాంకేతికతను జోడించి, ప్రజలకు సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించే అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.