కృష్ణా: పెనమలూరు మండలం కానూరు సిద్ధార్థ కాలేజీలో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన కొనుగోలుదారులు- అమ్మకదారుల సమ్మేళనం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.