WGL: నగరంలోని NIT డైరెక్టర్ ఆచార్య బిద్యాధర్ సుబూధికి నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (NAAI) ‘డిస్టింగ్విష్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాలర్ అవార్డు’ లభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ కంట్రోల్, రోబోటిక్స్ రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. దీంతో ఆయనకు కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు శుభాకాంక్షలు తెలిపారు.