KNR: కరీంనగర్ నగరపాలక సంస్థలో పౌర సేవలను సులభతరం చేయడానికి ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సేవలను ప్రారంభించారు. ఇకపై ఫైళ్లు, ప్రజల ఫిర్యాదులను ఆన్ లైన్ ద్వారా వేగంగా పరిష్కరిస్తామని చెప్పారు. పారదర్శక పాలన కోసం ఈ డిజిటల్ సంస్కరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు.