NDL: బనగానపల్లె మండలం కైప గ్రామంలో ఇవాళ వైసీపీ నాయకుడు బాల తిమ్మారెడ్డి అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గ్రామానికి చేరుకుని బాల తిమ్మారెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ పార్టీ నేతలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.