BHNG: రామన్నపేట మండలం వెల్లంకికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత పని కోసం ఐదేండ్ల క్రితం భువనగిరిలోని ఫయ్ స్టార్ ఫైనాన్స్‌లో రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. 2 నెలలుగా చేనేత పనులు లేకపోవడంతో EMI కట్టలేదు. దీంతో మనస్థాపానికి గురై మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. SI నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.