MLG:మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ విస్తరణ పనులు ఆదివాసీ పూజారుల ఇష్టం, ఆమోదం మేరకే చేపట్టామని మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. గద్దెల అభివృద్ధి పనుల్లో సొంత నిర్ణయాలు లేవని, పూజారులు, ఆర్కిటెక్ట్, ఆదివాసీ పూర్వీకుల అనుమతితోనే జరుగుతున్నాయని.. నిధుల విడుదల మాత్రమే ప్రభుత్వం చేసిందని, మిగతా అన్ని పూజారుల అనుమతితోనే సాగుతున్నాయన్నారు.