AP: చంద్రబాబు చెబుతున్న అమరావతి రాజధాని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచుతున్నారని ఆరోపించారు. అమరావతిపై జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని, పైగా రాజధాని పేరుతో దూషిస్తున్నారని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల అప్పుతో సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా నిర్మిస్తున్న అమరావతితో ఏం రెవెన్యూ వస్తుందని ప్రశ్నించారు.