న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం వడోదరలో ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీని కలిసేందుకు చిన్నారులు తరలివచ్చారు. వారితో విరాట్ దిగిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ ఫొటోలో ఉన్న ఓ బాబు, చిన్నప్పుడు కోహ్లీ ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ‘కోహ్లీ టైమ్ ట్రావెల్ ఏమైనా చేశాడా?’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.