MBNR: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తి గల వారు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో కళాశాలకు రావాలని తెలిపారు.