AP: రాజధానిగా అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాలన వికేంద్రీకరణలో కూడా జగన్ అమరావతికి తక్కువ చేయలేదని.. ప్రజాధనం వృథా కాకూడదనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్ తన ఇల్లు, పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడే నిర్మించుకున్నారని తెలిపిన ఆయన.. చంద్రబాబు ఇంకా అక్రమ నివాసంలోనే ఉంటున్నారని దుయ్యబట్టారు.