MBNR: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొంది. ముసాయిదా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ నేటితో ముగుస్తుండటంతో అందరి దృష్టి వార్డుల రిజర్వేషన్లపై పడింది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారుతాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారైనా కలిసొచ్చేనా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రధాన పార్టీల్లో అప్పుడే టికెట్ల పంచాయితీ మొదలైంది.