SRCL: సంక్రాంతికి ఊరు వెళ్తున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. జిల్లాలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాలనీలు, ఇంటి పరిసరాల్లో స్వీయ రక్షణార్థం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.