AKP: యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని అగ్రహారం గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రైతు గొర్రెల రామకృష్ణకు చెందిన ఆవు ఒకే కాన్పులో రెండు ఆడ దూడలకు జన్మనిచ్చింది. ఈ వార్త తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యానికి గురై, దైవానుగ్రహంగా భావించి, ఆవు వద్దకు చేరుకుని సింహాద్రి అప్పన్న నామస్మరణతో పూజలు నిర్వహించారు. ఈ సంఘటనను శుభ సూచకంగా పరిగణించారు.