కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో ప్రజలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ డిమాండ్ చేశారు. గుడివాడ సీపీఎం కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. టిడ్కో కాలనీ ఏర్పడి సుమారు 8–9 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ 1500 గృహాలు లబ్ధిదారులకు అప్పగించలేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే సబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.