PPM: సంక్రాంతి సంబరాలలో బాగంగా పాచిపెంటలో కబడ్డీ పోటీలను ఎస్సై లాలం అర్జున్ శనివారం ప్రారంభించారు. ఎస్సై మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, యువత క్రీడలు ఆడటం వలన ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో వివిధ గ్రామాలు క్రీడాకారులు, టీడీపీ మండల అధ్యక్షులు గుడెపు యుగంధర్ పాల్గొన్నారు.