MBNR: గండీడ్ మండల పరిధిలోని పెద్దవార్వాల్ గ్రామంలో పీపీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ను కాంగ్రెస్ యువ నాయకుడు వెంకటేష్ గౌడ్ ప్రారంభించారు. క్రీడలతో యువతకు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.