CTR: సదుం మండలంలోని ఎర్రాతివారి పల్లి కోటమలై అయ్యప్ప స్వామి ఆలయాన్ని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు శనివారం సందర్శించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన ఇరుముడితో 18 మెట్ల గుండా స్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించారు. ఆయనకు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు.