MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామంలో శనివారం ఆరోగ్య సిబ్బంది చిన్న పిల్లలకు నెలవారి ఇంజెక్షన్లు అందించారు. ఈ సందర్భంగా గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అలాగే, ఇంటి పరిసరాలను చెత్త, చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు సునీత, పుష్ప, లావణ్య, సత్యమ్మ పాల్గొన్నారు.